వాంతులు చేసుకుంటుండగా తల తెగిపడింది..

Sat,January 19, 2019 01:37 PM

Woman head severed as she leans out of bus to vomit in Madhya Pradesh

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని డైమండ్ క్రాసింగ్ సెంటర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ 56 ఏళ్ల మహిళ సత్నా జిల్లా నుంచి పన్నా జిల్లాకు ఆర్టీసీ బస్సులో బయల్దేరింది. బస్సులో ప్రయాణిస్తోన్న ఆశారాణికి వాంతులు అయ్యాయి. దీంతో ఆమె తలను బస్సు కిటికీలో నుంచి బయటకు పెట్టింది. డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతో ఆమె తల కరెంట్ స్తంభానికి తగిలింది. ఈ దెబ్బకి ఆశారాణి తల తెగి కింద పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

10024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles