కోడిపుంజుపై కేసు పెట్టిన మహిళ.. ఎందుకో తెలిస్తే మీరు షాకే..!

Mon,February 4, 2019 06:18 PM

woman filed a case against chicken in Shivpuri of Madhya Pradesh

ఓ మహిళ కోడిపుంజుపై కేసు పెట్టింది. అరే.. అలా పగలబడి నవ్వుతారెందుకు. నిజంగానే ఆమె కోడిపుంజు మీదనే కేసు పెట్టింది. ఆగండి.. ఆగండి.. ఆ నవ్వు ఆపండి. ఆమె ఎందుకు పెట్టిందో తెలిస్తే.. మీరు నవ్వడం ఆపి షాక్ అవుతారు. పదండి ఓసారి మధ్యప్రదేశ్ వెళ్లొద్దాం.

మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలోనే ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకున్నది. పూనమ్ కుష్‌వాహా అనే మహిళ తన పొరుగింటి వాళ్లు పెంచుకుంటున్న కోడిపుంజుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ కోడిపుంజు తన ఇంటికి వచ్చి మరీ తన కూతురును పొడుస్తున్నదట. అదే ఆమె ఆరోపణ. ఆ ఒక్క కోడి మాత్రమే కాదు.. ఆ కోడిని పెంచుకుంటున్న జంట‌ను కూడా పోలీస్ స్టేషన్‌కు లాగింది పూనమ్.

"నా కూతురును కోడిపుంజు చాలాసార్లు పొడిచింది. దీంతో నా కూతురుకు గాయాలయ్యాయి. కోడిపుంజును మా ఇంట్లోకి రాకుండా ఆపాలని వాళ్లకు ఎన్నో సార్లు చెప్పా. కానీ.. వాళ్లు పట్టించుకోలేదు. నా కూతురుకు ఇంకా గాయాలవడం నాకిష్టం లేదు. అందుకే కోడిపుంజుపై కేసు పెట్టా.." అంటూ పూనమ్ తెలిపింది.

"అది కోడిపుంజు కాదు.. మా బిడ్డ. మాకు పిల్లలు పుట్టకపోతే ఈ కోడిపుంజును పెంచుకుంటున్నాం. అది మా కన్నబిడ్డల కన్నా ఎక్కువ. దాని కోసం ఎంత దూరమైనా పోతాం. దాన్ని మాత్రం అరెస్ట్ కానివ్వం. దాని బదులు మేం జైలుకు పోయి చిప్ప కూడు తింటాం.." అంటూ కన్నీటి పర్యంతమయ్యారు కోడిపుంజు యజమానులైన జంట.

అయితే.. ఈ కోడిపుంజు వ్యవహారం పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో.. కోడిపుంజుపై కేసేంటి.. అంటూ ఆ మహిళకు, కోడిపుంజు ఓనర్లకు సర్దిచెప్పి పంపించారట పోలీసులు.

9672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles