మహిళపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో మాజీ భర్త

Fri,November 9, 2018 02:25 PM

Woman Dies After Being Gang-Raped,

రాంచీ: ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. మహిళ మాజీ భర్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమె ప్రైవేటు పార్ట్‌లో ఓ కర్రను చొప్పించి తీవ్ర హింసకు గురిచేశారు. దుండగుల దాడిలో మహిళ మృతిచెందింది. ఈ దారుణ సంఘటన జార్ఖండ్ లోని జమ్టారా జిల్లాలో గురువారం నాడు చోటుచేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి బీ.ఎన్.సింగ్ వివరాలను వెల్లడిస్తూ.. మహిళ మాజీ భర్తను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బుధవారం రాత్రి మహిళ సినిమా చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమె మాజీ భర్త మరో ఇద్దరు వ్యక్తులతో వచ్చి ఆమెను బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లిపోయారు. సామూహిక అత్యాచారం చేసిన అనంతరం మహిళ ప్రైవేటు పార్ట్‌లో కర్రెను చొప్పించి హింసించారు. గురువారం తెల్లవారుజామున మహిళ అరుపులు విని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహిళ మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

4561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS