బాలికలను వేధిస్తుంటే చితకబాదిన లేడీ కానిస్టేబుల్..వీడియో

Wed,December 11, 2019 08:46 PM

బాలికలను వేధిస్తున్న ఓ ఆకతాయిని నడిరోడ్డుపైనే చితకబాది బుద్ది చెప్పింది మహిళా కానిస్టేబుల్. కాన్పూర్ లోని బీతూరులో బాలికలు పాఠశాలకు వెళ్తుండగా ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన చంచల్ చౌరాసియా అనే మహిళా కానిస్టేబుల్ ఆ వ్యక్తి కాలర్‌ ని పట్టుకుని షూతో ఉతికిఆరేసింది. ఆ తర్వాత జులాయిని పోలీస్ స్టేషన్‌కు తరలించింది. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

4032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles