400 ఏళ్ల శాపం నుంచి విముక్తి!

Thu,December 7, 2017 04:43 PM

Wodeyar Royal family of Mysore finally gets a heir after 400 years of Curse

బెంగళూరు: వినడానికి ఇదేదో సినిమా స్టోరీలాగానే అనిపిస్తుంది.. కానీ నిజం. మైసూర్ రాజ కుటుంబమైన వడయార్స్‌కు 400 ఏళ్ల కిందటి శాపం నుంచి విముక్తి లభించింది. ఆ కుటుంబానికి ఇప్పుడు వారసుడు వచ్చాడు. యదువీర్ క్రిష్ణదత్త చామరాజ వడయార్, ఆయన భార్య త్రిషికా కుమారి దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. గతేడాది జూన్‌లో వీళ్ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. యదువీర్‌ను ఇంతకుముందు రాని ప్రమోదా దేవి రెండేళ్ల కిందట దత్తతకు తీసుకున్నది. ప్రమోదా దేవి, ఆమె భర్త శ్రీకాంతదత్త నరసింహరాజాకు పిల్లలు లేరు. 1612 నుంచి ఈ రాజ కుటుంబం ఓ శాపాన్ని అనుభవిస్తున్నట్లు చెబుతారు. వీళ్లకు ఇప్పటివరకు సొంత వారసులు లేరు. 1612లో వడయార్స్ రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో అప్పటి శ్రీరంగపట్నం రాజు భార్య ఆలెమాలెమ్మ ఈ కుటుంబాన్ని శపించిందని అంటారు. రాజవంశానికి చెందిన నగలతో ఆమె కావేరీ తీరంలోని తలక్కాడ్ అనే ఊరికి పారిపోతున్న సమయంలో.. రాజా వడయార్‌కు చెందిన సైనికులు ఆమెను చుట్టుముట్టారు.

దీంతో ఆమె కావేరీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమయంలోనే వడయార్ల కుటుంబానికి ఎప్పుడూ వారసులు పుట్టరంటూ శపించింది. ఆమె శపించినట్లే ఈ నాలుగు వందల ఏళ్లలో వడయార్లకు వారసులు పుట్టలేదు. సమీప బంధువులను దత్తతకు తీసుకుంటూ రాజ్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇన్నేళ్లుగా ఆలెమాలెమ్మ అనుగ్రహం పొందడానికి ఈ రాజ కుటుంబం ప్రయత్నిస్తూనే ఉన్నది. అప్పట్లోనే రాజా వడయార్ మైసూర్‌లో ఆమె విగ్రహం కూడా ఏర్పాటుచేశారు. కొన్నేళ్ల కిందట అప్పటి రాజు శ్రీకాంతదత్త.. తలక్కాడ్‌లో ఆమెకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మొత్తానికి ఇన్నేళ్లకు వారసుని జననంతో తమకు శాప విముక్తి కలిగిందని మైసూర్ రాజ కుటుంబం భావిస్తున్నది.

7292
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles