కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తా

Fri,May 17, 2019 09:39 AM

Will resign if Congress gets wiped out from Punjab says Amarinder Singh

హైదరాబాద్‌ : పంజాబ్‌ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు అమరీందర్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెరుగైన విజయం సాధించకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అమరీందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అనుకున్న స్థానాల్లో తమ పార్టీ గెలవకపోతే.. ఓటమిని అంగీకరించి.. సీఎం పదవికి రాజీనామా చేస్తాను అని అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములపై మంత్రులు, ఎమ్మెల్యేలదే బాధ్యత అని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గెలిచినా, ఓడిపోయినా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందేనని అమరీందర్‌ సింగ్‌ తేల్చిచెప్పారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ 13 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందన్న విశ్వాసం ఉందన్నారు పంజాబ్‌ సీఎం. గత లోక్‌సభ ఎన్నికల్లో 13 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్‌ పార్టీ 3 స్థానాల్లోనే గెలిచింది. బీజేపీ 6, ఆప్‌ 4 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ పార్టీ 77 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

3103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles