క్యాపిటేష‌న్ ఫీజును మోదీ ర‌ద్దు చేస్తారా ?

Wed,January 11, 2017 12:57 PM

న్యూఢిల్లీ : ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ అత్యుత్త‌మైన‌ద‌ని మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబ‌రం ఆరోపించారు. నైపుణ్య భార‌త్‌, స్వ‌చ్ఛ భార‌త్ గురించి ఇప్పుడు ఎవ‌రూ మాట్లాడ‌డం లేద‌న్నారు. జ‌వాన్లు ఎంత వ‌ర‌కు సుర‌క్షితంగా ఉన్నార‌ని ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. న‌గ‌దు ర‌హిత వ్య‌వ‌స్థ గురించి ప్ర‌ధాని మాట్లాడుతున్నార‌ని, గ‌తంలో ఎప్పుడూ అలా జ‌ర‌గ‌ట్లు ఆయ‌న చెబుతున్నార‌ని చిదంబ‌రం విమ‌ర్శించారు. కార్డు ద్వారా డ‌బ్బులు చెల్లించాలన్న విధానాన్ని తామే ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు మాజీ మంత్రి చెప్పారు. జూన్ లేదా జులై నెల‌లో ఇంజ‌నీరింగ్‌, మెడిసిన్ కాలేజీలు ప్రారంభం అవుతాయ‌ని, ఆ కాలేజీలు క్యాప్టేష‌న్ ఫీజును వసూల్ చేస్తాయ‌ని, దాన్ని మోదీ అడ్డుకోవాల‌ని స‌వాల్ చేశారు. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు త‌మ డైర‌క్ట‌ర్ల‌కు ఆర్బీఐ ఎప్పుడు నోటీసులు జారీ చేసింద‌ని, వాళ్ల‌కుకు ఎంత స‌మ‌యం ఇచ్చారో ప్ర‌ధాని చెప్పాల‌ని చిదంబ‌రం ప్ర‌శ్నించారు. నోట్ల ర‌ద్దు అంశంపై క్యాబినెట్ స‌మావేశం జ‌రిగింద‌న్నారు, కానీ దానికి సంబంధించిన రికార్డులు ఏమీ లేవ‌ని, మంత్రుల‌ను ఖైదీలుగా మార్చి ప్రధాని వాళ్లను బంధించార‌ని చిదంబ‌రం విమ‌ర్శించారు. నోట్ల ర‌ద్దు వల్ల జీడీపీపై ప్ర‌భావం ఉండద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ త‌ప్ప ఆ మాట ఎవ‌రూ అన‌డం లేద‌న్నారు.

1719

More News

మరిన్ని వార్తలు...