అందరి బాకీలు తీరుస్తా : మాల్యా

Wed,September 12, 2018 03:09 PM

will pay everyones due, says Vijay Mallya at London court

లండన్ : ఎస్‌బీఐ గ్రూపు బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసిన విజయ్ మాల్యా లండన్‌లో మీడియాతో మాట్లాడారు. అందరి బాకీలు తీర్చేందుకు సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సమగ్రమైన సెటిల్మెంట్ ఆఫర్ చేశానని, కర్నాటక హైకోర్టు ముందు ఆ ఆఫర్ పెట్టినట్లు, ఈ అంశంపై న్యాయవాదులు మిగితా నిర్ణయం తీసుకోవాల్సి ఉంద‌ని మాల్యా అన్నారు. ఇవాళ వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు ఆయన అప్పగింత కేసులో హాజరయ్యారు. ఒకవేళ విజయ్ మాల్యాను అప్పగిస్తే ఆయన్ను ఏ జైలులో వేయాలో, దాని వీడియోను పంపాలంటూ గతంలో లండన్ కోర్టు కోరింది. ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వం లండన్ కోర్టుకు ఓ వీడియోను కూడా పంపించింది. మాల్యాను ఉంచాలనుకుంటున్న జైలు వీడియోను ఇవాళ కోర్టు పరిశీలించనున్నది. ఎస్బీఐ నుంచి సుమారు 9 వేల కోట్ల రుణాలు తీసుకున్న కేసులో మాల్యా ప‌రారీలో ఉన్నారు.

2844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles