బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే

Mon,May 6, 2019 10:44 PM

Will form a strong government says SP Chief Akhilesh Yadav

హైదరాబాద్ : దేశంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే అని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజలు ప్రాథమిక అవసరాలను కూడా కోల్పోతారని అఖిలేష్ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల వల్ల ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో సామాన్య ప్రజానీకానికి మోదీ చేసిందేమీ లేదు. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ అయితే పేద ప్రజలను పట్టించుకోలేదని అఖిలేష్ ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ప్రధాని కాదు.. పబ్లిసిటీ మినిస్టర్ అని ఎస్పీ చీఫ్ ఎద్దెవా చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని అఖిలేష్ కోపోద్రిక్తులయ్యారు.

1745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles