ఆ సినిమా థియేటర్లను తగులబెడుతాం..

Thu,January 18, 2018 02:39 PM

Will burn all theatres screening Padmaavat, warns Rajput community

రాయ్‌పూర్: పద్మావత్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. రాజ్‌పుత్‌లు మాత్రం ఆ తీర్పు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ లీలా భన్సాలీ ఫిల్మ్ ఎక్కడ నడిచినా.. ఆ థియేటర్లను దగ్ధం చేస్తామని హెచ్చరించారు. చత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌పుత్ వర్గీయులు ఈ హెచ్చరికలు చేశారు. ఇదే తమ ఇచ్చే చివరి వార్నింగ్ అని, రాణి పద్మావతి గురించి తక్కువ చేసి ఎవరూ చూపించరాదు అని, సినిమాను ప్రదర్శించే థియేటర్లను తగులబెడుతామని చత్తీస్‌ఘడ్ రాజ్‌పుత్‌లు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఆ రాష్ర్టానికి చెందిన రాజ్‌పుత్ వర్గీయులు హోంమంత్రికి ఓ లేఖ కూడా సమర్పించారు. పద్మావత్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. హర్యానాకు చెందిన ఓ నేత కూడా ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. పద్మావత్ రిలీజైన థియేటర్లకు నిప్పు పెడుతామన్నారు. సుప్రీం కోర్టు తీర్పు తమ మనోభావాలను దెబ్బతీసిందన్నారు.

1486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles