కట్నం కింద బైక్‌ ఇవ్వలేదని భార్యను చంపేశాడు..

Tue,June 11, 2019 11:10 AM

wife killed by husband for dowry in Chhattisgarh

రాయ్‌పూర్‌ : వరకట్న వేధింపులకు మహిళలు బలి అవుతూనే ఉన్నారు. కట్నం కింద బైక్‌ ఇవ్వలేదని భార్యను చంపేశాడు ఓ భర్త. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌గఢ్‌ ముంగేలి జిల్లాలోని బొందరా గ్రామంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కట్నం కింద బైక్‌ ఇస్తామని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయితే పెళ్లి సమయంలో బైక్‌ ఇవ్వలేదు. ఆ తర్వాత తనకు బైక్‌ ఇప్పించాలని భార్యను భర్త వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు చోటు చేసుకున్నారు. ఈ నెల 8న భార్యను భర్త గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత హత్యగా చిత్రీకరించేందుకు మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు.

3774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles