భార్యకు నిద్ర మాత్రలిచ్చి.. కూతురిపై అత్యాచారం

Fri,September 14, 2018 01:53 PM

Wife catches husband raping daughter in Uttar Pradesh

లక్నో : ఓ మానవ మృగం.. కూతురిపైనే కన్నేశాడు. భార్యకు నిద్ర మాత్రలు ఇచ్చి.. కూతురిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని బుధానా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఇవాళ వెలుగు చూసింది. 40 ఏళ్ల వ్యక్తి తన భార్యకు అప్పుడప్పుడూ నిద్ర మాత్రలు ఇచ్చేవాడు. దీంతో ఆమె గాఢ నిద్రలోకి జారుకున్న మరుక్షణమే 14 ఏళ్ల కూతురిపై కామంతో చెలరేగిపోయేవాడు. అలా ఆర్నేళ్ల పాటు సొంత బిడ్డపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు తండ్రి. దీంతో ఆ చిన్నారి తన బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. అయితే గురువారం ఉదయం భార్యకు మేలకువ వచ్చి నిద్ర లేవగా.. కూతురిపై అత్యాచారం చేస్తున్న భర్తను చూసింది. దీంతో ఒక్కసారి షాక్‌కు గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త పరారీలో ఉన్నాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

15283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS