2వేల నోటును ఎందుకు ముద్రించడం లేదు ?

Wed,April 18, 2018 05:50 PM

Why Rs 2000 notes are not printed, asks Yashwant Sinha

హైదరాబాద్: దేశవ్యాప్తంగా అకస్మాత్తుగా కరెన్సీ కష్టాలు వచ్చాయి. బ్యాంకుల్లో, ఏటీఎంల్లో డబ్బులు లేవని జనం ఇబ్బందిపడుతున్నారు. అయితే సడన్‌గా డిమాండ్ పెరగడం వల్ల నగదు కొరత ఏర్పడిందని కేంద్రం పేర్కొన్నది. మరి 2 వేల నోట్లను ఎందుకు ప్రింట్ చేయడం ఆపేశారని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఓ వ్యాసంలో ఇవాళ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. 2వేల నోట్లను హోర్డర్లు దాచుకుంటున్నారని మధ్యప్రదేశ్ సీఎం ఆరోపిస్తున్నారు. మరి అలాంటి హోర్డర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. సడన్‌గా క్యాష్ డిమాండ్ పెరిగిందంటున్నారు కదా, మరి దానికి కారణం ఏమిటని ఎందుకు చెప్పడం లేదన్నారు. ఇంతకీ ప్రభుత్వం 2వేల నోటును ఎందుకు ముద్రించడం లేదని యశ్వంత్ సిన్హా అడిగారు. 2వేల నోటును చెలామణి నుంచి తొలిగిస్తున్నారా అని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా బ్యాంకులకు ఉన్న అవసరాలను గుర్తించి, ఆర్బీఐ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.

3284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles