అయోధ్యపై ఆర్డినెన్స్ ఎందుకు? కోర్టుతీర్పు రానీయండి

Thu,November 29, 2018 03:38 PM

WHY ORDINANCE LETS WAIT FOR COURT JUDGEMENT

అయోధ్యపై మాటలయుద్ధం అంతకంతకూ తీవ్రమవుతున్నది. ఆలయ నిర్మాణానికి అనుకూలశక్తులమధ్యనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుడికన్నా ముంద విగ్రహం కట్టేస్తానని యూపీ సీఎం ఆదిత్యనాథ్ తొందరపడుతుంటే రాముడికి గుడి ముఖ్యం.. భారీ విగ్రహం కానేకాదు అని సంతుల సభ వ్యతిరేకత తెలిపింది. మరోవైపు కోర్టు తీర్పు ఆలస్యమవుతున్నది కనుక ఆర్డినెన్స్ తెచ్చి గుడి కట్టేయాలని డిమాండ్లు అంతకంతకూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా రాందేవ్‌బాబా ఆర్డినెన్స్‌కు పిలుపునిచ్చారు. దీనిపై నిర్మోహీ అఖాడా ప్రధాన పూజారి మహంత్ దినేంద్రదాస్ అభ్యంతరం తెలిపారు. ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏముంది? కోర్టులో విచారణ జరుగుతున్నది కదా? కోర్టు నిర్ణయమే అంతిమం అవుతుంది. కోర్టు నిర్ణయంమ కోసం మేం ఎదురు చూస్తాం.. అని ఆయన గురువారం మీడియాతో అన్నారు. అయోధ్యలో ఆలయం కట్టకపోతే ప్రజలకు బీజేపీపై నమ్మకం పోతుందని, అందుకే ఆర్డినెన్స్ తేవాలని రాందేవ్‌బాబా వంటివారు అంటున్నారు. యూపీలోనూ, కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండీ గుడి కట్టలేకపోయారని ప్రజలు నిలదీస్తారని వారి అభిప్రాయం.

1307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles