డ‌బ్బులు ఇస్తాన‌న్నా.. బ్యాంకులు ఎందుకు తీసుకోవ‌డం లేదు?

Thu,February 14, 2019 10:51 AM

Why is PM Modi not instructing banks to accept money I am offering, asks Vijay Mallya

హైద‌రాబాద్: భార‌తీయ బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌వేసి ప‌రారీలో ఉన్న విజ‌య్ మాల్యా ఇవాళ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా స్పందించారు. త‌న ట్వీట్‌లో ఆయ‌న ప్ర‌ధాని మోదీని కొన్ని ప్ర‌శ్న‌లు అడిగారు. బ్యాంకుల‌కు తాను డ‌బ్బులు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, మ‌రి ఆ బ్యాంకులు డ‌బ్బులు తీసుకునేలా మోదీ ఎందుకు ఆదేశాలు ఇవ్వ‌డం లేద‌ని ప్రశ్నించారు. బుధ‌వారం లోక్‌స‌భ‌లో మోదీ మాట్లాడుతూ త‌న గురించి గుర్తు చేశార‌ని, ఓ వ్య‌క్తి 900 కోట్ల‌తో ప‌రార‌య్యాడ‌న్నార‌ని, ఆ వ్య‌క్తి తానే అని త‌న‌కు అర్థ‌మైంద‌ని, మ‌రి డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ప్పుడు, ఆ డ‌బ్బును బ్యాంకులు తీసుకునేలా మోదీ ఎందుకు ఆదేశాలు ఇవ్వ‌డం లేద‌ని మాల్యా ప్ర‌శ్నించారు. కింగ్‌ఫిష‌ర్ సంస్థ‌కు ఇచ్చిన పూర్తి రుణాల‌ను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాన‌న్నారు. త‌న బాకీలు చెల్లించేందుకు క‌ర్నాట‌క ముందు కూడా సెటిల్మెంట్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు మాల్యా చెప్పాడు. దీన్ని త‌ప్పుప‌ట్టాల్సి అవ‌స‌రం లేద‌ని, చాలా నిజాయితీతో ఆ ఆఫ‌ర్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కింగ్‌ఫిష‌ర్‌కు ఇచ్చిన రుణాల‌ను బ్యాంకులు ఎందుకు వెన‌క్కి తీసుకోవ‌డం లేద‌ని మాల్యా ప్ర‌శ్నించారు. త‌న వ‌ద్ద ర‌హ‌స్య ఆస్తులు ఉన్నాయ‌ని కొన్ని మీడియా సంస్థ‌లు ఆరోపిస్తున్నాయని, అదే నిజం అయితే కోర్టు ముందు 14వేల కోట్ల విలువైన ఆస్తుల‌ను ఎందుకు స‌మ‌ర్పిస్తాన‌న్నారు. ఈనెల 4వ తేదీన మాల్యాను అప్ప‌గించేందుకు భార‌త్‌తో బ్రిట‌న్ ఒప్పందం కుదుర్చుకున్న‌ విష‌యం తెలిసిందే.1769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles