ముస్లింలు మాత్ర‌మే జైలు నుంచి పారిపోతారా?: దిగ్విజ‌య్‌

Tue,November 1, 2016 12:36 PM

Why Do Only Muslims Break Out of Jail and Not Hindus, asks Digvijaya Singh

భోపాల్‌: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. భోపాల్ జైలు నుంచి పారిపోయిన 8 మంది సిమి ఉగ్ర‌వాదుల ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌పై ఆయ‌న మాట్లాడుతూ.. దానికి మ‌తం రంగు పులిమే ప్ర‌య‌త్నం చేశారు. కేవ‌లం ముస్లిం సిమి ఉగ్ర‌వాదులే జైలు నుంచి పారిపోతారా.. హిందువులు ఎవ‌రూ పారిపోరా అంటూ ప్ర‌శ్నించారు. సిమి ఉగ్ర‌వాదులు జైలు నుంచి పారిపోయే అవ‌కాశం ఉంద‌ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చ‌రించినా శివ‌రాజ్‌సింగ్ ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయి విచార‌ణ జ‌ర‌పాల‌ని, హైకోర్టు జ‌డ్జి లేదా నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ విచార‌ణ జ‌రిపితేనే అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.


తాను ఏమైనా త‌ప్పుగా మాట్లాడి ఉంటే త‌న‌పై చ‌ర్య తీసుకోవ‌చ్చ‌ని బీజేపీకి దిగ్విజ‌య్ స‌వాలు విసిరారు. అయితే కొన్ని వీడియో క్లిప్స్ చూసి కాంగ్రెస్ త‌మ సొంత తీర్పులు చెప్ప‌డం స‌రికాద‌ని కేంద్ర మంత్రి కిర‌ణ్‌ రిజిజు అన్నారు. అధికారులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను అనుమానించ‌డం మానేయాల‌ని, నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. సోమ‌వారం భోపాల్ జైలు నుంచి త‌ప్పించుకున్న 8 మంది ఉగ్ర‌వాదుల‌ను కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే పోలీసులు ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ట్టుబెట్టిన విష‌యం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డం ఎన్‌కౌంట‌ర్‌పై అనుమానాల‌కు తావిస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్వ‌తంత్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. అటు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి మాట్లాడుతూ.. ఉగ్ర‌వాదుల ద‌గ్గ‌ర ఆయుధాలు లేవ‌ని, వారిని చంప‌కుండా ఉండాల్సింద‌న్న ఆమె.. న్యాయ‌విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు.

2952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles