నన్నెందుకు ఎంపిక చెయ్యవు?

Tue,February 12, 2019 07:55 AM

Why do not you select me

న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్, ఢిల్లీ క్రికెట్ సంఘం(డీడీసీఏ) సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ అమిత్ భండారీపై మూకుమ్మడి దాడి జరిగింది. సోమవారం సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో దాదాపు 15 మంది గుర్తుతెలియని వ్యక్తులు హాకీ స్టిక్స్, రాడ్లు, సైకిల్ చైన్లతో దాడికి పాల్పడ్డారు. అండర్-23 జట్టుకు అనూజ్ ధేడాను ఎంపిక చేయని కారణంగా అతని తరఫు వ్యక్తులు అమిత్‌పై ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దాడి జరిగిన వెంటనే మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సీనియర్ జట్టు ఆటగాళ్లు..హుటాహుటిన దగ్గరలోని సివిల్ లైన్స్‌లోని సంత్ పరమానంద్ దవాఖానలో చేర్పించినట్లు సహచర సెలెక్టర్ సుక్విందర్ సింగ్ తెలిపారు. స్టీఫెన్స్ మైదానంలో ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది.

సరిగ్గా మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో అనూజ్ ధేడా అనే వ్యక్తి వచ్చి ఎందుకు ఎంపిక చేయలేదంటూ భండారీపై చేయి చేసుకున్నాడు. అదే క్రమంలో మరో 15 మంది వ్యక్తులు ఒక్కసారిగా హాకీ స్టిక్స్, రాడ్లు, సైకిల్ చైన్లతో విచక్షణ రహితంగా అమిత్‌పై దాడికి దిగారు అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ నుపూర్ ప్రసాద్ పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు అనూజ్‌తో పాటు అతని సోదరుడు నవీన్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, గంభీర్ స్పందించారు. ఢిల్లీ సెలెక్టర్ అమిత్‌పై దాడి గర్హనీయం. దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండాచర్యలు తీసుకోవాల్సిన అసరముంది అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దేశ రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటన జరుగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఎంపిక చేయని కారణంగా దాడికి పాల్పడిన ఆటగానిపై క్రికెట్ ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలి అని గంభీర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles