ఏం సాధించారని సంబురాలు.. మీది అపవిత్ర బంధమే!

Mon,May 21, 2018 04:42 PM

Why Congress is celebrating in Karnataka asks BJP President Amit Shah

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. కర్ణాటకలో ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. మీ ముఖ్యమంత్రి ఒక స్థానంలో ఓడిపోయారు. సగం మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అటు జేడీఎస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నది. 37 స్థానాలు గెలిచినందుకా అని అమిత్ షా నిలదీశారు.


అతిపెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నించామని ఆయన స్పష్టంచేశారు. హార్స్ ట్రేడింగ్ చేశారని మాపై ఆరోపణలు చేశారు. మరి కాంగ్రెస్ చేసింది ఏమిటి? వాళ్లు మొత్తానికే అమ్ముకున్నారు అని షా విమర్శలు గుప్పించారు. ప్రజల తీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్, జేడీఎస్ చేతులు కలిపాయని, వాళ్లది ముమ్మాటికీ అపవిత్ర బంధమేనని అమిత్ షా స్పష్టంచేశారు.
ఇప్పుడు ప్రతిపక్షాలకు ఈవీఎంలపై నమ్మకం కుదిరింది. ఎన్నికల సంఘంపై నమ్మకం కుదిరింది. అసంపూర్తి విజయం చేతుల్లో ఉన్నా వాళ్లకు ఈవీఎంలు, ఎన్నికల సంఘం నచ్చింది. ఓడిపోయినప్పుడు కూడా ఇలాగే ఉండాలని, సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టబడి ఉండాలని కోరుకుంటున్నా అని అమిత్ షా అన్నారు. గవర్నర్‌ను యడ్యూరప్ప ఏడు రోజుల సమయం కోరినట్లు కాంగ్రెస్ ప్రచారం చేయడం సరి కాదని, కావాలంటే ఆయన గవర్నర్‌కు ఇచ్చిన లేఖను అడగాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

2116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles