ఆదిత్య థాకరేకు నచ్చాడు.. ఈ ముంబై ఇండియన్స్ ఫ్యాన్.. ఎందుకంటే: వీడియోWed,April 25, 2018 03:27 PM

Why Aaditya Thackeray Thinks This Mumbai Indians Fan Has A Future In Politics

ఆదిత్య థాకరే ఎవరో తెలుసు కదా. మహరాష్ట్రలోని శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కొడుకు. ఇప్పుడు శివ సేన పార్టీలోని యూత్ వింగ్ యువసేనకు అధ్యక్షుడిగా ఉన్నాడు. పార్టీ కార్యకలాపాలు కూడా చూసుకుంటున్నాడు. సరే.. ఇవన్నీ పక్కన బెడితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆదిత్య థాకరే ఓ చర్చను లేవనెత్తాడు. అదేంటో తెలుసుకోవాలంటే మనం ఐపీఎల్ 11 సీజన్‌లోకి వెళ్లాల్సిందే.

గత కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్ 11 ఇండియాకు కొత్త శోభను తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. ఇక.. ఈ ఐపీఎల్‌లో రెండు మూడు జట్లకు కూడా వీరాభిమానులు ఉంటారు. ఎప్పుడైతే తాము వీరాభిమానం ప్రదర్శించే రెండు జట్లు తలపడతాయో.. ఇక అప్పుడే ఉత్పన్నమవుతుంది అసలు సమస్య. ఏ జట్టుకు సపోర్ట్ చేయాలో అర్థం కాక ఐపీఎల్ అభిమానులు నెత్తి పీక్కుంటున్నారు. కాని.. ముంబై ఇండియన్స్ అభిమాని అయిన ఓ యువకుడు మాత్రం తన తెలివితో తనకు ఇష్టమైన రెండు జట్లకు ఎలా మద్దతు ఇచ్చాడన్నదే ఇప్పుడు ఆదిత్య థాకరే లేవనెత్తిన చర్చ.స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఆ యువకుడు పేరు కునాల్.. ముంబై ఇండియన్స్ కు వీరాభిమాని. కాని.. ధోనీకి కూడా ఫ్యానే. అందుకే రెండింటి మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో రెండు జట్లకు చెందిన జెర్సీలను మారుస్తూ భలే మద్దతిచ్చారు. ఈ ఘటనను రికార్డు చేసిన ఓ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. అదే వీడియోను ఆదిత్య థాకరే తన ట్విట్టర్ అకౌంట్ షేర్ చేస్తూ ఏం క్యాప్సన్ పెట్టాడంటే.. "సేమ్ నాలాగే కనిపిస్తున్నాడు. రాజకీయాల్లోకి వస్తాడో రాడో మాత్రం తెలియదు.. అని అన్నాడు." ఇక.. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు మాత్రం ఆ యువకుడి తెలివికి మెచ్చుకొని నిజంగానే ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నాడు.


ఇక.. తన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండటంతో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తనే ఓ ట్వీట్ ట్వీటి వివరణ ఇచ్చుకున్నాడు కునాల్. ఏమని అంటే.. "ధోనీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు చాలా ఇచ్చాడు. అందుకే ఆయనకు నా మద్దతు ఇచ్చాను. ఇక.. నేను స్వతహాగా ముంబై ఇండియన్స్ అభిమానిని. ఎందుకంటే నేను ముంబై వాసిని కాబట్టి. కాని.. క్రికెట్ కోసం ధోనీ పడ్డ కష్టం, ఆయన తన ఫ్యాన్స్ కోసం చేసిన విషయాలను నేను అస్సలు మరిచిపోను. నేను ఇలా చేయడం ఎవరికైనా నచ్చకపోతే నన్ను క్షమించండి.." అని కునాల్ ట్వీటాడు. ఇక కునాల్ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు.. నీ అభిమానాన్ని ఈవిధంగా చాటి చెప్పావు. దానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అని కునాల్ మద్దతుగా నిలుస్తున్నారు.

2708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS