ఎవరీ స్వామి అసిమానంద్..?

Mon,April 16, 2018 04:52 PM

Who is Swami Aseemanand ? how many terror cases he is facing ?

హైదరాబాద్: స్వామి అసిమానంద్. 2007లో హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు. ఆ పేలుడు ఘటనలో మొత్తం పది మంది నిందితులు ఉన్నారు. అందులో స్వామి అసిమానంద్ ఒకరు. 2007, మే 18న మసీదులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. హిందూ అతివాద ఉగ్రవాదులు నిర్వహించిన అతిపెద్ద, మొట్టమొదటి బాంబు దాడిగా ఈ ఘటనను గుర్తించారు. గతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యకర్తగా అసిమానంద్ చేశారు. ఈ కేసులో 2010లో ఆయన్ను మొదటిసారి అరెస్టు చేశారు. ఇవాళ ఎన్‌ఐఏ కోర్టు మక్కా మసీదు పేలుడు కేసులో అసిమానంద్‌ను దోషిగా ప్రకటించింది.

అసిమానంద్ అసలు పేరు నాబా కుమార్ సర్కార్. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా అతనిది. వృక్షశాస్త్రంలో అతను పీజీ చేశాడు. జితన్ చటర్జీ, ఓంకార్‌నాథ్ అన్న పేర్లు కూడా ఈయనకు ఉన్నాయి. 1977 నుంచి పశ్చిమ బెంగాల్‌లోని పురిలియా, బంకురా, బిర్‌బమ్ జిల్లాలో ఆదివాసీ కల్యాన్ ఆశ్రమం కోసం పనిచేశారు. గిరిజన ప్రాంతాల్లో మతమార్పుడులు చేయించాడు. శబరీ థామ్ ఆశ్రమాన్ని నడిపించాడు. ఇతనికి అనుచురులు కూడా ఎక్కువే. వారిని కూడా సీబీఐ అనేక కేసుల్లో ప్రశ్నిస్తూనే ఉన్నది.
మక్కా మసీదు కేసుతో పాటు అజ్మీర్, మాలేగావ్, సంజౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసుల్లోనూ అసిమానంద్ నిందితుడు. 2007లో జరిగిన అజ్మీర్ పేలుళ్ల కేసులో ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు అతన్ని నిర్ధోషిగా తేల్చింది. తన కార్యకర్తలతో కలిసి అనేక ప్రార్థన ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడినట్లు 2010లో ఢిల్లీ కోర్టు ముందు అతను అంగీకరించాడు. ముస్లింల ఉగ్రచర్యలకు బదులు తీర్చుకోవాలన్న ఉద్దేశంతో అజ్మీర్ షరీఫ్, మక్కా మసీదు, మలేగావ్, సంజౌతా పేలుళ్లు నిర్వహించినట్లు చెప్పాడు.

బాంబుకు బాంబుతోనే బదులివ్వాలన్న ఉద్దేశంతోనే తాను బాంబు దాడులకు పూనుకున్నట్లు కోర్టు వాంగ్మూలంలో అతను తెలిపాడు. హిందూ అతివాదులు, ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్, సంఘ్ పరిచారక్ సునీల్ జోషి, సాధ్వీ ప్రగ్యా సింగ్ థాకూర్‌లతోనూ కలిసి పనిచేసినట్లు అసిమానంద్ చెప్పాడు. దేశ విభజన సమయంలో హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో కలపాలని నిజాం ప్రభువు ఆలోచించాడని, అందుకే హైదరాబాద్‌లోని మక్కాను టార్గెట్ చేసినట్లు ఆయన చెప్పాడు. 2007లో జరిగిన సంజౌతా రైలు పేలుడు ఘటనలో తనతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారన్నాడు.

ఇప్పటి వరకు రెండు కేసుల్లో స్వామి అసిమానంద్ దోషిగా తేలాడు. ఇక సంజౌతా రైలు పేలుడు కేసులో మాత్రం అతను ఇంకా విచారణ ఎదుర్కొంటున్నాడు. 2007, ఫిబ్రవరి 19న జరిగిన ఆ రైలు పేలుడులో సుమారు 68 మంది చనిపోయారు. ఈ కేసులో పంజాబ్ ప్రభుత్వం అతనికి బెయిల్ మంజూరీ చేసింది.

3657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles