ఢిల్లీపై నియంత్ర‌ణ ఎవ‌రిది? తేల్చ‌నున్న సుప్రీం

Thu,February 14, 2019 10:13 AM

who controls Delhi, Supreme court to give final verdict in state center row

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీపై ఎవ‌రి నియంత్ర‌ణ ఉంటుంది ? కేంద్ర ప్ర‌భుత్వానిదా లేక రాష్ట్ర ప్ర‌భుత్వానిదా ? అధికారాలు ఎవ‌రి ఆధీనంలో ఉంటాయి ? ఆ రాష్ట్ర సీఎంపైనా లేక లెఫ్గినెంట్ గ‌వ‌ర్న‌ర్‌పైనా ? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు ఇవాళ సుప్రీంకోర్టు త‌న తీర్పుతో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవ‌ల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారాల కోసం కేంద్రంతో యుద్ధానికి దిగారు. మొద‌ట్లో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ న‌జీబ్ జంగ్‌, ఆ త‌ర్వాత అనిల్ బైజ‌ల్‌తోనూ సీఎం కేజ్రీవాల్ కొన్ని సంద‌ర్భాల్లో పేచీకి పోవాల్సి వ‌చ్చింది. అయితే ఢిల్లీలో ఎవ‌రి ఆదేశాల‌కు ప్రాముఖ్య‌త ఇవ్వాల‌న్న‌ది ఇంకా స్ప‌ష్టంగా లేదు. ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు త‌న తీర్పును న‌వంబ‌ర్ ఒక‌ట‌వ తేదీ నుంచి రిజ‌ర్వ్‌లో ఉంచింది. ఇవాళ ఆ తుది తీర్పును సుప్రీం వెల్ల‌డించ‌నున్న‌ది. జ‌స్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ఉన్న విభేదాల‌కు పుల్‌స్టాప్ పెట్ట‌నున్న‌ది. ప్ర‌జ‌ల చేత పూర్తి మెజారిటీతో ఎన్నుకోబ‌డినా.. ఢిల్లీలో త‌మ ప్రాబ‌ల్యం త‌క్కువే అని ఆప్ వాదిస్తున్న‌ది. అందుకే ఆ పార్టీ ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. అయితే గ‌త జూలైలో కోర్టు ఓ స్ప‌ష్ట‌మైన ఆదేశాన్ని ఇచ్చింది. ఢిల్లీలోకి పూర్తి స్థాయి హోదా ఇవ్వ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. కానీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మాత్రం ఒంట‌రి నిర్ణ‌యాలు తీసుకోరాదు అని, ఎన్నికైన ప్ర‌భుత్వ స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకోవాల్సి ఉంటుంద‌ని కోర్టు తెలిపింది.

1212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles