దేశంలో 'ఈవీఎం'ల ప్రస్థానమిలా..

Wed,March 27, 2019 08:10 AM

When and where was the first EVM used in India

కొత్తగూడెం: ఈవీఎం ఓటర్ల తీర్పును... నేతల భవితవ్యాన్ని తేల్చే యంత్రం. ఎన్నికల వేళ కీలకమైన ఈ మెషిన్‌ మూడున్నర దశాబ్దాల కిందట పుట్టిం ది. చట్టసభల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానంలోఓటింగ్ ముఖ్యం కాగా కాలానుగుణంగా అనేక సాంకేతిక మార్పులు వచ్చాయి. దేశంలో మొదట సాధారణ ఎన్నికలు 1951లో జరగ్గా బ్యాలెట్ విధానం అమలులో ఉంది. తరువాత సాంకేతికతలో భాగంగా 2004 నుం చి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌నే ఈవీఎం అంటారు. 1982లోనే ఈవీఎంల వినియోగాన్ని ప్రారం భించారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించారు. అయితే వీటి వ్యయం, సమయం ఎక్కువగా తీసుకోవడంతో ఈవీఎంల వినియోగా నికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా ఈ యంత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. అయితే నిర్వహణ లోపాలు, సందేహాలతో కొంతకాలం పక్కన ఉన్న ఈవీఎంలు ఆ తరువాత నిలదొక్కుకుంది. అప్పటి నుంచి అనేక ఎన్నికల్లో వీటిని వినియోగి స్తున్నారు.

మొదటి సారిగా కేరళ రాష్ట్రంలోని పరూర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1982 మే 19వ తేదీన ఈవీఎంలను వినియోగించారు. ఆ తరువాత 1982,83లో దేశ వ్యాప్తం గా జరిగిన పది ఉప ఎన్నికల్లో వీటిని వినియోగించారు. అయితే వీటి పనితీరుపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 1984లో మే 5న ఈవీఎం వినియోగాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి 1988 డిసెంబర్‌లో కేంద్రం సెక్షన్ 61ఏ ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టంతో ఈవీఎంల వాడకాన్ని చేర్చింది.

ప్రజా ప్రాతినిధుల చట్టం సెక్షన్ 61ఏ సవరణ 1988 మార్చి 15న అమలులోకి వచ్చింది. 1990 జనవరి ఎన్నికల సంస్కరణల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో ఈవీఎంల వాడకాన్ని సాంకేతిక నిపుణుల కమిటీ సమర్ధించింది. 1998లో ప్రజామోదం లభించింది. 1999, 2004 సంవత్సరాల్లో వివిధ రాష్ర్టాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. లోక్‌సభకు 2004-2014 మధ్య జరిగిన అన్ని ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు.

వీవీప్యాట్‌ల అనుసంధానం

2013 ఆగస్టు 14వ తేదీన ఈవీఎంలకు వీవీప్యాట్ (ఓటరు వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్)ను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. నాగాలాండ్ రాష్ట్రంలోని నాక్సెస్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2013 సెప్టెంబర్ 4న వీవీప్యాట్‌లను మొదటి సారిగా వినియోగించారు. 2013 అక్టోబర్ 8వ తేదీన దశల వారీగా వీవీప్యాట్‌లను వినియోగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింంది. దీంతో కేంద్రం 2017 ఏప్రిల్‌లో రూ. 3173.47 కోట్లతో 16.15 లక్షల వీవీప్యాట్‌ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీవీప్యాట్‌లను వినియోగించారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లోనూ వీవీప్యాట్‌లను వాడనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించారు. ఈవీఎంలతో పాటు ఈ యంత్రాలపై అవగాహన కూడా కల్పించారు.

719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles