అక్కడ కపిల్ సిబల్‌కు ఏం పని?

Tue,January 22, 2019 06:03 PM

What was Kapil Sibal doing there asks BJP on EVM hacking allegations

న్యూఢిల్లీ: 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి బీజేపీ గెలిచిందన్న సైబర్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయమని తెలిసి ఇప్పటి నుంచే కాంగ్రెస్ ఓ సాకును వెతుక్కుంటున్నదని బీజేపీ విమర్శించింది. అమెరికాలో రాజకీయ ఆశ్రయం పొందున్న భారత సైబర్ ఎక్స్‌పర్ట్ షుజా లండన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు ఈసీ ఫిర్యాదు చేసింది. ఈవీఎం హ్యాకింగ్ విషయం తెలిసి తన స్నేహితుల్లో కొంతమందిని చంపేశారని, అందుకే తాను భయపడి ఇండియా నుంచి పారిపోయి వచ్చాననీ అతను చెప్పాడు. అయితే ఇవన్నీ కాంగ్రెస్ ప్రేరేపిత ఆరోపణలని బీజేపీ కొట్టి పారేసింది.

అసలు ఆ ఈవెంట్‌ను నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆశిశ్ రే కాంగ్రెస్ వ్యక్తి అని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు ఆ ఈవెంట్‌లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు ఏం పని అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. సిబల్ అక్కడేం చేస్తున్నారు? ఏ హోదాలో ఆయన అక్కడున్నారు? కాంగ్రెస్ తరఫున ఆ ఈవెంట్‌ను ఆయన మానిటర్ చేస్తున్నారు. భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నమిది అని ఆయన విమర్శించారు. 1996లోనే ఈవీఎంలు వచ్చాయని, అప్పటి నుంచీ బీజేపీయేతర పార్టీలు ఎన్నో ఎన్నికల్లో గెలిచాయని ఆయన అన్నారు. బీజేపీ గెలిస్తే ఈవీఎంలపై ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.

2424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles