ఆ రెండు గంటలు ప్రధాని నరేంద్రమోదీ ఏం చేశారు?

Fri,February 22, 2019 04:57 PM

What Pm Modi did in those two hours

ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ విమర్శలు పదునెక్కుతున్నాయి. పుల్వామా దాడి పట్ల ఆయన స్పందనను ప్రధాన ప్రతిపక్షం మరోసారి ప్రశ్నించింది. ప్రధాని ప్రచార చిత్రం షూటింగ్‌లో బిజీగా గడిపారని నిన్న దుయ్యబట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాని ఆ రెండు గంటలు ఏంచేశారో చెప్పాలని నిలదీసింది. ఆయనకు ఘటన గురించి పూర్తిగా తెలియదని లేదా తెలిసినా ఆయన స్పందన తగినవిధంగా లేదని ధ్వజమెత్తింది. ప్రధాని ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ ర్యాలీని ఉద్దేశించి ఫోన్ ద్వారా ప్రసంగించినట్టు డీడీన్యూస్ తెలిపిందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారి ఓ పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. 3.10కి దాడి జరిగిందని, 5.10కి ఆయన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారని, ఈలోగా ఏం జరిగిందో దేశానికి చెప్పాలని అన్నారు. 5.10కి ర్యాలీలో మాట్లాడినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ పుల్వామా దాడిని ప్రస్తావించకపోవడాన్ని తివారీ ఎత్తిచూపారు. ప్రధానికి దాడి గురించి నిజంగానే తెలియదా? లేక తెలిసినా దానిని పట్టించుకోలేదా? అని ప్రశ్నించారు. ఇందులో ఏది నిజమైనా ప్రధాని దేశానికి సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. రెండురకాల పరిస్థితులు కూడా దేశానికి అంత మంచివి కావని తివారీ అభిప్రాయపడ్డారు. బీజేపీ ఈ విమర్శలను తిప్పికొట్టింది. కాంగ్రెస్ ఆరోపణలు సిగ్గుచేటని విమర్శించింది. సైన్యాన్ని, ప్రభుత్వాన్ని సమర్థిస్తానని చెప్పిన పార్టీ మాట తప్పిందని అన్నది.

2249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles