నిపా వైరస్ ఏంటి? ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?

Mon,May 21, 2018 12:46 PM

What is Nipah Virus and what are the symptoms of this

తిరువనంతపురం: నిపా వైరస్.. కేరళను వణికిస్తున్న ఈ కొత్త వ్యాధి ఇప్పటికే 16 మందిని పొట్టన పెట్టుకుంది. నిజానికి ఈ వైరస్ ఇప్పుడే పుట్టుకొచ్చిందేమీ కాదు. 1998-99లోనే మలేషియా, సింగపూర్‌లలో 100 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. నిపా వైరస్ (NiV) పారామిక్సోవిరిడే జాతికి చెందిన వైరస్. దీనిని 1999లోనే గుర్తించినట్లు అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. ఇండియాలోనూ గతంలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. బంగ్లాదేశ్‌లో అయితే ప్రతి ఏటా కనిపిస్తూనే ఉంటుందని సీడీసీ తెలిపింది.

అప్పుడు పందులు.. ఇప్పుడు గబ్బిలాలు


ఈ వైరస్ కారణంగా మెదడు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. 1999లో పశువులకు దగ్గరగా ఉండే రైతులు, ఇతరుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆ సమయంలో 300 పందులు పాక్షికంగా ఈ వైరస్ బారిన పడగా.. వంద మందికి పైగా మరణించారు. మొత్తం 265 మందికి ఈ వైరస్ సోకగా.. 40 శాతం మంది వ్యాధి ముదరడంతో చనిపోయారు. అప్పట్లో వ్యాధి సోకకుండా పది లక్షల పందులను చంపేశారు.

ఆ పేరు ఎలా వచ్చింది


ఈ వైరస్‌ను మొదటగా మలేషియాలో గుర్తించారు. అక్కడి సుంగాయ్ నిపా అనే గ్రామంలో మొదటగా ఈ వైరస్ కనిపించడంతో దానికి నిపా అనే పేరు పెట్టారు. పందుల తర్వాతి కాలంలో కొన్ని జాతుల గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. మలేషియా నుంచి 2001లో ఈ వైరస్ మెల్లగా బంగ్లాదేశ్‌కు పాకింది. ఆ తర్వాత ఇండియాలోని సిలిగురిలో కూడా వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు.

వ్యాధి లక్షణాలు


ఈ నిపా వైరస్ ముదరడానికి 7 నుంచి 14 రోజులు పడుతుంది. ఆ తర్వాత శరీరంలో చాలా వేగంగా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మెదడులో వాపు మొదలవుతుంది. ప్రస్తుతం కేరళలో ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు మరికొన్ని లక్షణాలు కూడా గుర్తించారు. జ్వరం, సడెన్‌గా శ్వాస ఆడకపోవడం, లో బీపీతో ఈ పేషెంట్లను వెంటిలేటర్లపై ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఈ వైరస్ సోకిన వారికి ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. అయితే ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినపుడు ఇచ్చే చికిత్సనే ఈ నిపాకు కూడా ప్రస్తుతం ఇస్తున్నారు.

ఎలా సోకుతుంది?


ఈ నిపా వైరస్ ఓ జూనోటిక్ వైరస్. అంటే ఇది మనుషులకు గాలి ద్వారా లేక లాలాజలం ద్వారా సోకుతుంది. అయితే ఇది గాలి ద్వారా సోకేది కాదని డాక్టర్లు చెబుతున్నారు. గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్పారు.

4134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles