మర్డర్ కేసు సాల్వ్ చేయడానికి వాళ్లింట్లో పనిమనిషిగా చేరా..

Wed,October 31, 2018 05:19 PM

Went Undercover As Maid says first woman private investigator

రజని పండిట్ గురించి తెలుసా మీకు. తెలియక పోవచ్చు. ఈ డిటెక్టివ్స్, ఇన్వెస్టిగేటర్స్‌తో టచ్ ఉన్నవాళ్లకి మాత్రం ఈమె పేరు సుపరిచతమే. ఈమె మొట్టమొదటి మహిళా ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. మన భాషలో చెప్పాలంటే ప్రైవేట్ డిటెక్టివ్ అన్నమాట. ఈ ఫీల్డ్‌లో మహిళలు ఎక్కువగా ఉండరు. చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అది. ఒక్కోసారి ప్రాణాల మీదికే వస్తుంది. అందుకే డిటెక్టివ్ ఫీల్డ్‌ను చాలామంది ఎంచుకోరు. ఇటువంటి చాలెంజింగ్ ప్రొఫెషన్ అంటే పాషన్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఫీల్డులో అడుగుపెడతారు. వాళ్లలో ఈ రజని ఒకరు. ఇప్పుడు ఈమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. ఆమె తన డిటెక్టివ్ కెరీర్‌లో ఓ కేసును సాల్వ్ చేయడం కోసం ఏకంగా మర్డర్ అయిన ఇంట్లోనే పనిమనిషిగా వెళ్లిందట. పనిమనిషిగా ఆరు నెలలు చేసి అప్పటికి ఆ కేసును సాల్వ్ చేసింది రజని. అయితే.. తన కెరీర్ ఏమీ సజావుగా సాగలేదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో కష్టాలు, అన్నింటినీ దైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగింది రజని. తన డిటెక్టివ్ కెరీర్‌పై హ్యుమన్స్ ఆఫ్ బాంబే అనే ఫేస్‌బుక్ పేజీలో ఓ స్టోరీ రాసింది. ఆ స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది. అందుకే.. ఇప్పుడు మనం ఆమె గురించి మాట్లాడుకునేది. సరే.. ఆమె పనిమనిషిగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో.. ఆ కేసును ఎలా సాల్వ్ చేసిందో ఆమె మాటల్లోనే చదువుదాం పదండి.

నేను కాలేజీలో ఉన్నప్పుడు అనుకోకుండా ఓ కేసును సాల్వ్ చేశాను. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆఫీస్ క్లర్క్‌గా పార్ట్‌టైమ్ పనిచేసేదాన్ని. ఆ సమయంలో నాతో పనిచేసే ఓ మహిళ వాళ్లింట్లో జరిగిన దొంగతనం గురించి నాకు చెప్పింది. తన కోడలే ఆ దొంగతనం చేసుంటుందని అనుమానించింది కానీ.. తన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. దీంతో ఆ దొంగతనాన్ని చేధించాలని నన్ను కోరింది. ఆమె నన్ను కేసు చేధించమని కోరడానికి ఓ కారణం ఉంది. మానాన్న అప్పుడు సీఐడీలో చేసేవాడు. నేను ఇన్వెస్టిగేషన్ గురించి చాలా విషయాలు ఆయన నుంచే నేర్చుకున్నా. ఆ దొంగతనాన్ని చేధించడానికి వాళ్ల స్ట్రీట్‌లో ఆరా తీశా. దీంతో ఆ మహిళ కొడుకే దొంగతనం చేశాడని తేలింది. అతడు ఒప్పుకున్నాడు కూడా. అలా నా డిటెక్టివ్ కెరీర్ ప్రారంభమయింది. అప్పుడు నా వయసు 22 ఏళ్లు.

అలా నా కెరీర్ టర్న్ అయి... డిటెక్టివ్ వైపు మళ్లింది. చాలామంది నా దగ్గరికి వచ్చేవారు. చాలా కేసులు సాల్వ్ చేశాను. దీంతో నా పేరు మార్మోగిపోయింది. మీడియా నన్ను పలుకరించింది. దీంతో ఇండియాలోనే మొట్టమొదటి మహిళా డిటెక్టివ్‌గా నిలిచాను. కానీ.. అది చాలా టఫ్ జాబ్. ఇది చాలా డేంజర్ ప్రొఫెసన్ అమ్మా.. అంటూ మా నాన్న నన్ను ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండేవాడు. కానీ.. ఆయనే ఈ కెరీర్‌లో నిలదొక్కుకోగా.. నేను నిలదొక్కుకోలేనా అని అనిపించేది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. నా వృత్తే నాకు ఫ్యామిలీ అయిపోయింది.

అన్ని కేసుల్లో నాకు చాలెంజింగ్ కేసు ఒకటి తగిలింది. అదే మర్డర్ కేసు. తండ్రీకొడుకులు హత్య చేయబడ్డారు. కానీ.. ఆధారాలు లేవు. ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. అనేది మాత్రం తెలియలేదు. దీంతో ఆ కేసు చేధించడానికి నేను తండ్రీకొడుకుల ఇంట్లో పనిమనిషిలా చేరా. ఆ ఇంట్లో ఉండేది ఒకే ఒక మహిళ. ఆమె భర్త, కొడుకే హత్యకు గురయింది. ఆమెమీదే అనుమానం. కానీ.. ఆధారాలు లేవు. ఆధారాల కోసం పనిమనిషిలా ఆరు నెలలు అదే ఇంట్లో పనిచేశా. తనకు నామీద నమ్మకం కలిగేలా చేశా. కానీ.. ఓరోజు నా రికార్డర్ సౌండ్ ఆమె విన్నది. దీంతో నన్ను నమ్మలేదు. నన్ను బయటికి పంపించలేదు. నన్ను ఇంట్లోనే ఉంచి తాళం వేసేది. దీంతో నేనేమీ చేయలేకపోయాను. ఓరోజు ఓ వ్యక్తి ఆమెను కలవడానికి వచ్చాడు. ఆవ్యక్తి ఎవరో కాదు.. ఆ మహిళ భర్త, కొడుకును చంపింది అతడే. అతడికి సుపారీ ఇచ్చి వాళ్లను చంపించింది ఆ మహిళ. నాకు సీన్ మొత్తం అర్థమయిపోయింది. వెంటనే ఎలాగైనా బయటికి వెళ్లాలి. దీంతో కత్తితో నా కాలును కోసుకున్నా. రక్తం కారుతోంది. బయటికి వెళ్లాలి... బ్యాండేజ్ తెచ్చుకుంటా అని చెప్పి వెంటనే ఇంట్లో నుంచి పరిగెత్తుకెళ్లా. ఎస్టీడీ బూత్‌కెళ్లి నాకు ఈ కేసు ఇచ్చిన క్లయింట్‌కు ఫోన్ చేశా. వెంటనే పోలీసులతో సహా ఇక్కడికి రావాలని చెప్పా. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అలా ఆ కేసు సాల్వ్ చేశా.

ఇప్పటి వరకు నేను మొత్తం 80 వేల కేసులను సాల్వ్ చేశా. వీటిపై రెండు పుస్తకాలు కూడా రాశా. చాలా అవార్డులు వచ్చాయి. న్యూస్ చానెళ్లలో కోకొల్లలుగా స్టోరీలు కూడా వచ్చాయి. అంతే కాదు నాకు చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ నేను వేటినీ లెక్క చేయను. నావరకు నేను నిజాయితీగా పనిచేయడమే నాకు తెలుసు. అదే నన్ను బతికిస్తుంది.

7873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS