రూపాయి బలహీనం.. దేశంపై 68 వేల కోట్ల అదనపు భారం!

Fri,September 7, 2018 04:47 PM

Weak rupee could cost India dear to repay foreign debt

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశం రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో మొదటిది పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాగా.. రెండోది క్షీణిస్తున్న రూపాయి విలువ. ముఖ్యంగా మన కరెన్సీ రోజురోజుకూ పతనమవుతుండటం దేశ అప్పుల భారాన్ని భారీగా పెంచుతున్నది. ఈ ఏడాది డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 శాతం క్షీణించింది. దీనివల్ల దేశంపై ఇప్పటికిప్పుడు రూ.68500 కోట్ల అదనపు భారం పడనుంది. స్వల్పికాలిక రుణాలను చెల్లించే క్రమంలో రానున్న నెలల్లో ఇంత భారీ మొత్తాన్ని దేశం అదనంగా భరించాల్సి ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 72కు పడిపోయింది. దీనివల్ల దేశ కరెంటు ఖాతా లోటు మరింత పెరగనుంది.

ఈ ఏడాది చివర్లో డాలర్‌తో రూపాయి విలువ 73గా ఉండి.. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 76 డాలర్లుగా ఉంటే.. దేశ ముడి చమురు దిగుమతుల మొత్తం రూ.45700 కోట్లకు చేరనుందని స్టేట్ బ్యాంక్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. 2017లో డాలర్‌తో రూపాయి మారకపు విలువ (రూ.65.1) తీసుకుంటే.. ఈ ఏడాది స్వల్పకాలిక రుణాల కింద రూ.7.1 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. అది ఇప్పటి సగటు మారకపు విలువ రూ.71.4 ప్రకారం తీసుకుంటే.. ఆ మొత్తం రూ.7.8 లక్షల కోట్ల డాలర్లు కానుందని ఘోష్ అంచనా వేశారు. అంటే సుమారు రూ.70 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

1192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles