భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకోం..

Tue,August 7, 2018 07:02 AM

we wont meddle in Indian elections, says Russian Embassy

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటుందని వస్తున్న వార్తలపై ఆ దేశం స్పందించింది. భారతీయ హుందాతనాన్ని తామెప్పుడూ నష్టం కలిగించమని రష్యా పేర్కొన్నది. పుతిన్ నేతృత్వంలోని రష్యా ప్రభుత్వం.. 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై రష్‌యా ఎంబసీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఏ దేశ అంతర్గత రాజకీయాల్లో రష్యా జోక్యం చేసుకోలేదని, తాము పాటిస్తున్న విదేశీ విధానానికి అది వ్యతిరేకమవుతుందని, బ్రిక్స్ భాగస్వామ్యుల మధ్య అగాధం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎంబసీ తన ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియా ఆధారంగా భారత్‌తో పాటు బ్రెజిల్‌లో జరగనున్న జాతీయ ఎన్నికలను ప్రభావితం చేయాలని రష్యా చూస్తున్నట్లు విమర్శలు వచ్చాయి.

2333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles