బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును కానివ్వం : కాంగ్రెస్‌ నేత

Fri,November 8, 2019 11:48 AM

ముంబయి : మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటును కానివ్వమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హుస్సేన్‌ దల్వాయి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీని వీడి బయటకు వెళ్లరు. పార్టీ హైకమాండ్‌ ఆదేశాలను ప్రతి ఎమ్మెల్యే పాటిస్తారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును కానివ్వం. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ కూటమి పార్టీ. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారు. మహారాష్ట్రను కాపాడాలని ఈ రాష్ట్ర ప్రజలు తమకు ఓటేశారు. బీజేపీ నాయకత్వం తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనలేరు. ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు తిరిగి సొంతగూటికి రావాలని ఆలోచిస్తున్నారు అని హుస్సేన్‌ దల్వాయి స్పష్టం చేశారు. మహారాష్ట్రకు బీజేపీ సీఎం ఉండకూడదు అనేది కాంగ్రెస్‌, ఎన్సీపీ అభిప్రాయం అని హుస్సేన్‌ చెప్పారు.

619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles