ఉగ్రదాడిని తిప్పికొడుతామని హామీ ఇస్తున్నా..

Thu,February 14, 2019 09:40 PM

we will give reaction to Terrorists attack says rajnathsingh

న్యూఢిల్లీ : పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ సంస్థ జవాన్లపై దాడికి తెగబడిందన్నారు. ఉగ్రదాడిని తిప్పికొడతామని దేశ ప్రజలకు హామీనిస్తున్నానన్నారు. అమరులైన జవాన్లకు దేశం యావత్తు నివాళి అర్పిస్తోందన్నారు. దాడి ఘటనపై కేంద్రహోంశాఖ కార్యదర్శి, సీఆర్పీపీఎఫ్ డీజీతో రాజ్ నాథ్ ఫోన్ లో మాట్లాడారు. రాజ్ నాథ్ రేపు జమ్మూకశ్మీర్ కు వెళ్లనున్నారు. రాజ్ నాథ్ ఈ నేపథ్యంలో రేపటి కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు. మరోవైపు రేపు ఉగ్రదాడి ఘటనాస్థలానికి ఎస్ఎస్ జీ, ఎన్ఐఏ బృందాలు వెళ్లనున్నాయి. పేలుడు ఘటనపై రెండు బృందాలు విచారణ జరుపనున్నాయి.

2013
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles