నోట్ల ర‌ద్దుతో బ్లాక్‌మ‌నీ టార్గెట్ చేశాం..

Thu,November 8, 2018 11:56 AM

we targeted black money outside India through demonetisation, says Arun Jaitley

న్యూఢిల్లీ: మోదీ ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి నేటితో రెండేళ్లు పూర్తి అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త‌న ఫేస్‌బుక్‌లో ఆ అంశంపై స్పందించారు. డ‌బ్బును స్వాధీనం చేసుకోవాల‌న్న ల‌క్ష్యంతో నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ను చేప‌ట్ట‌లేద‌న్నారు. కానీ అక్ర‌మంగా దాచుకున్న సొమ్మును ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి తీసుకురావాల‌న్న ఉద్దేశంతో డిమానిటైజేష‌న్ చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. నోట్ల ర‌ద్దును ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుప‌డుతున్న స‌మ‌యంలో.. మోదీ చ‌ర్య‌ను జైట్లీ గ‌ట్టిగా స‌మ‌ర్థించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మ ప‌ద్ధ‌తిలో పెట్టేందుకు తీసుకున్న నిర్ణ‌యాల్లో డిమానిటైజేష‌న్ ఒక‌టి అని జైట్లీ అన్నారు. దేశం బ‌య‌ట ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని ప్ర‌భుత్వం టార్గెట్ చేసింద‌ని, జ‌రిమానా ప‌న్ను క‌ట్టి, ఆ సొమ్మును తీసుకువ‌చ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే న‌ల్ల‌ధ‌నాన్ని తీసుకురాని వారిపైన చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. విదేశాల్లో అకౌంట్లు ఉన్న‌వారిని ప్ర‌శ్నిస్తున్నామ‌న్నారు. అక్ర‌మంగా నిలువ చేసుకున్న డ‌బ్బును.. నోట్ల ర‌ద్దు చ‌ర్య‌తో బ్యాంకుల‌కు వ‌చ్చే విధంగా చేశామ‌న్నారు. ఈ ప‌ద్ధ‌తి వ‌ల్ల సుమారు 17.42 ల‌క్ష అక్ర‌మ అకౌంట్ల‌ను గుర్తించామ‌న్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి, ప‌న్ను ఎగ‌వేసిన వారిని శిక్షించామ‌న్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు పెర‌గ‌డం వ‌ల్ల‌, ఇప్పుడా బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నాయ‌న్నారు. చాలావ‌ర‌కు అక్ర‌మ డ‌బ్బు ఇప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్స్ రూపంలో పెట్టుబ‌డిగా పెట్టార‌న్నారు. దీంతో ఆ సొమ్ము మొత్తం ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చేసింద‌ని మంత్రి జైట్లీ అన్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌ర్స‌న‌ల్ ఇన్‌కం ట్యాక్స్ రాబ‌డి పెరిగింద‌న్నారు.

2452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles