మేం ప్రతిపక్షంలోనే కూర్చుంటాం : మల్లికార్జున్ ఖర్గే

Mon,November 11, 2019 08:04 AM

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేమని భారతీయ జనతా పార్టీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ వైఖరి కీలకంగా మారింది. అయితే ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వస్తే మద్దతు ఇచ్చే విషయంపై ఆలోచిస్తామని ఎన్సీపీ స్పష్టం చేసింది.


కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. మేం ప్రతిపక్షంలోనే కూర్చుంటాం.. ఇదైతే ప్రస్తుతమున్న పరిస్థితి అని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు సోనియా గాంధీతో సమావేశం ఉందన్నారయన. ఆ సమావేశం అనంతరం హైకమాండ్ చెప్పినట్లు నడుచుకుంటామని ఖర్గే పేర్కొన్నారు. సోనియాగాంధీతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తామని శరద్ పవార్ కూడా చెప్పారు.

రాత్రి 7:30 గంటల్లోపు తెలియజేయండి
ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని శివసేన పార్టీని గవర్నర్ కోరారు. సోమవారం రాత్రి 7:30 గంటల్లోపు తమ వైఖరి తెలియజేయాలని గవర్నర్ శివసేనకు సూచించారు. ప్రభుత్వం తామే ఏర్పాటు చేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

1638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles