డెంగ్యూ నివారణ కోసం చర్యలు తీసుకున్నాం: ఢిల్లీ ప్రభుత్వం

Tue,October 4, 2016 01:09 PM

we prepared thousand beds for dengue patients

న్యూఢిల్లీ: డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తోన్న ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈమేరకు ఈ పిటిషన్‌పై వివరాలు అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఢిల్లీ ప్రభుత్వం కోర్టులో అఫిడెవిట్ దాఖలు చేసింది. డెంగ్యూ నివారణ కోసం చర్యలు తీసుకున్నామని తెలిపింది. డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే దోమల నివారణ కోసం మూడు వందల ఫాగింగ్ మిషన్లను ఏర్పాటు చేశామని, రోగుల కోసం ఆస్పత్రుల్లో వెయ్యి పడకలను సిద్ధంగా ఉంచామని పేర్కొంది.

1176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS