రాజ్యాంగంపైనా దాడి జరుగుతోంది

Sat,January 19, 2019 02:47 PM

కోల్‌కతా : ఇవాళ ఈ దేశ మహోన్నత రాజ్యాంగంపైనా దాడి జరుగుతోంది అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై మోదీ ప్రభుత్వ దాడిని దేశం మొత్తం చూస్తోందన్నారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది అని మండిపడ్డారు. కోట్ల మందికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పదవులను ఆశించి తామంతా ఇక్కడకు రాలేదన్నారు. దేశంలో మార్పు సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. తమకు కావాల్సింది పదవులు కాదు.. ఈ దేశ ప్రజల రక్షణ, రైతన్నకు భద్రత, యువతకు భవిష్యత్ అని శరద్ పవార్ స్పష్టం చేశారు.

837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles