దీదీ దీక్ష‌పై స్పందించిన ఒడిశా సీఎం

Tue,February 5, 2019 02:58 PM

భువ‌నేశ్వ‌ర్: కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ కోల్‌క‌తాలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చేప‌ట్టిన దీక్ష‌పై ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ స్పందించారు. బెంగాల్‌లోని సీబీఐ వ్య‌వ‌హారం మీతో ఎవ‌రైనా మాట్లాడారా అని ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు న‌వీన్ బ‌దులిచ్చారు. గ‌త ఏడాది కాలం నుంచి తృణ‌మూల్ పార్టీకి చెందిన ఒక్క‌రు కూడా కాంటాక్ట్‌లో లేర‌న్నారు. రాష్ట్ర అంశాల‌పైనే త‌మ పార్టీ అభిప్రాయాలు వెల్ల‌డిస్తోంద‌న్నారు. సీబీఐ ఓ ప్రొఫెష‌న‌ల్ తీరులో ప‌నిచేసేందుకు స‌హ‌కారం అందించాల‌న్నారు. సీబీఐ అంశంలో రాజ‌కీయ జోక్యం స‌రికాద‌న్నారు.

3069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles