ఆ పాకిస్థాన్ పైలట్ పేరు మాకు తెలుసు!

Tue,March 12, 2019 05:21 PM

We Know that Pakistan Pilot details says Defence Minister Nirmala Sitaraman

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసిన తర్వాత పాకిస్థాన్ ఎదురు దాడికి దిగిన సంగతి తెలుసు కదా. తమ దగ్గర ఉన్న ఎఫ్-16 ఫైటర్ జెట్లతో ఇండియాలోని మిలిటరీ స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే దీనిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. మిగ్-21 బైసన్ జెట్ నడుపుతున్న వింగ్ కమాండర్ అభినందన్.. ఓ ఎఫ్-16 విమానాన్ని కూడా కూల్చాడు. అయితే ఆ పాకిస్థాన్ ఎఫ్-16ను నడుపుతున్న పైలట్ వివరాలకు తమకు తెలుసు అని తాజాగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. మొదట మన రక్షణ బలగాలకు ఆ పాకిస్థానీ పైలట్ వివరాలు తెలుసని అంగీకరించడానికి నిరాకరించారు. అయితే ఆ తర్వాత మరోసారి అడగటంతో అవును, మాకు తెలుసు అని ఆమె అన్నారు. అయితే ఆ వివరాలు మాత్రం ఆమె చెప్పలేదు. పాక్‌కు చెందిన ఎఫ్-16 కూలిందనడానికి ప్రత్యక్ష సాక్షులతోపాటు ఎలక్ట్రానిక్ ఆధారం కూడా తమ దగ్గర ఉన్నదని ఇంతకుముందే విదేశాంగ వెల్లడించింది. అసలు పాక్ ఈ దాడికి ఎఫ్-16ను వాడింది అనడానికి ఆ విమానం నుంచి ఫైర్ అయిన అమ్రామ్ మిస్సైల్ శకలాలనే ఆధారంగా భారత్ చూపించింది.

4675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles