న్యూ ఇండియా వ‌ద్దు.. ఓల్డ్ ఇండియా కావాలి

Mon,June 24, 2019 04:49 PM

we dont want new india, we want old india, says Gulam Nabi Azad


హైద‌రాబాద్‌: రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ నేత గులాం న‌బీ ఆజాద్ మాట్లాడారు. మాకు న‌వ భార‌తం వ‌ద్దు అని, మాకు పురాత‌న భార‌త‌మే కావాల‌న్నారు. ఓల్డ్ ఇండియాలో ప్రేమ‌, సంస్కృతి పుష్క‌లంగా ఉండేవ‌ని, ముస్లింలు, ద‌ళితులు ఇబ్బందిప‌డితే.. హిందువులు ఆ బాధ‌ను అర్థం చేసుకునేవార‌న్నారు. ఒక‌వేళ హిందువుల‌కు ఏమైనా అయినా.. అప్పుడు ముస్లింలు, ద‌ళితులు వారి క‌న్నీళ్ల‌ను తుడిచేవార‌న్నారు. జార్ఖండ్‌లో దౌర్జ‌న్యాలు సర్వ‌సాధార‌ణం అయిపోయాయ‌న్నారు. హింస పెరిగింద‌న్నారు. ద‌ళితులు, ముస్లింల‌ను అక్క‌డ చంపేస్తున్నార‌ని ఆరోపించారు. స‌బ్‌కా సాత్ స‌బ‌క్ వికాస్ నినాదానికి మేం క‌ట్టుబ‌డి ఉన్నాం, కానీ ప్ర‌జ‌ల‌కు అది అందేలా చూడాల‌ని మోదీని ఆజాద్ కోరారు.

753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles