17 నిమిషాల్లోనే బాబ్రీ మ‌సీదును కూల్చేశాం..

Fri,November 23, 2018 04:54 PM

We demolished Babri in 17 minutes, says Shiv Sena leader Sanjay Raut

ల‌క్నో: బాబ్రీ మ‌సీదును కూల్చేందుకు కేవ‌లం 17 నిమిషాలే ప‌ట్టింద‌ని శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ తెలిపారు. కానీ అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం బీజేపీ ఎందుకు ఇంత ఆల‌స్యం చేస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ థాక‌రే.. త్వ‌ర‌లో అయోధ్య‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సంజ‌య్ రౌత్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రామ మందిర నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తున్న‌వారు, మునుముందు దేశంలో తిరిగేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్నారు. బాబ్రీ మ‌సీదును కూల్చేందుకు 17 నిమిషాలు ప‌డితే, మ‌రి ఆల‌య నిర్మాణం కోసం చ‌ట్టాన్ని చేయ‌డానికి ఎంత స‌మ‌యం ప‌ట్టాల‌ని రౌత్ ప్ర‌శ్నించారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం విష‌యంలో బీజేపీ స‌రైన దిశ‌లో అడుగులు వేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. యూపీలో, కేంద్రంలో, రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లోనూ బీజేపీ హ‌వా న‌డుస్తున్న‌ద‌ని, వీలైనంత త్వ‌ర‌గా అయోధ్య‌లో రామ మందిరాన్ని నిర్మించేందుకు కేంద్రం ఓ చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని రౌత్ కోరారు. ఆదివారం రోజున ఉద్ద‌వ్ థాకరే.. అయోధ్య‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. రామ మందిర నిర్మాణం కోసం ఇంకెన్ని ఎన్నిక‌లు కావాల్సి వ‌స్తుంద‌ని థాక‌రే ప్ర‌శ్నించ‌నున్నారు. హ‌ర్ హిందూకీ య‌హీ పుకార్‌.. పెహ్లీ మందిర్ ఫిర్ స‌ర్కార్ అన్న నినాదాన్ని ఉద్ద‌వ్ వినిపించ‌నున్నారు.

2764
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles