మీతో ఉన్నాం.. ఇస్రోకు వెల్లువెత్తుతున్న ట్వీట్లు

Sat,September 7, 2019 03:11 AM

హైద‌రాబాద్‌: విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ అంద‌క‌పోవ‌డంతో.. శాస్త్ర‌వేత్త‌ల్లో తీవ్ర నిరాశ నెల‌కొన్న‌ది. అయితే శాస్త్ర‌వేత్త‌ల్లో మ‌నోధైర్యాన్ని నింపుతూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ల్యాండింగ్ ప్ర‌క‌ట‌న ఆల‌స్యం కావ‌డంతో అంతటా ఉత్కంఠ నెల‌కొన్న‌ది. యావ‌త్ దేశం ఇస్రో వెంటే ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. మీ క‌ఠోర శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశాయ‌ని కాంగ్రెస్ త‌న ట్వీట్‌లో తెలిపింది. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా త‌న ట్వీట్‌లో రియాక్ట్ అయ్యారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు అండ‌గా ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌తి ఒక‌రిలోనూ మీరు అంత‌రిక్ష అవ‌గాహ‌న పెంచిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. భ‌విష్య‌త్తు ప్ర‌యోగాల కోసం బెస్ట్ విషెస్ చెప్పారాయ‌న‌.











3225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles