భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌స్తాం : అమిత్ షా

Fri,May 17, 2019 04:44 PM

We are confident that Modi government will return to power, says Amith Shah

హైద‌రాబాద్: ప్ర‌ధాని మోదీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మ‌ళ్లీ మోదీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని విశ్వాసం ఉంద‌ని షా అన్నారు. భారీ మెజారిటీతో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని బీజేపీ అధ్య‌క్షుడు తెలిపారు. జ‌న్ సంఘ కాలం నుంచి కూడా బీజేపీ ఓ వ్య‌వ‌స్థ‌గా ప‌నిచేస్తోంద‌న్నారు. 2014లో దేశ ప్ర‌జ‌లు చ‌రిత్రాత్మ‌క తీర్పునిచ్చార‌న్నారు. మొద‌టి సారి కేంద్రంలో కాంగ్రెస్ లేని పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింద‌న్నారు. ఫిర్ ఏక్ బార్ మోదీ స‌ర్కార్ అన్న నినాదం ప్ర‌జ‌ల నుంచే వ‌చ్చింద‌ని షా తెలిపారు. బీజేపీపై ఇప్పుడు ప్ర‌జ‌ల్లో మ‌రింత విశ్వాసం పెరిగింద‌న్నారు.

686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles