సుప్రీం తీర్పును గౌరవించాలి : ప్రియాంక గాంధీ

Sat,November 9, 2019 02:51 PM

న్యూఢిల్లీ : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు వెల్లడించిన తుది తీర్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అన్ని పార్టీలు, సంఘాలు, పౌరులు గౌరవించాలని ప్రియాంక ట్వీట్ చేశారు. సామరస్యం మరియు సోదరభావంతో కలిసి జీవించే భారతదేశపు పాత సంప్రదాయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పరస్పర సామరస్యాన్ని, సోదరత్వాన్ని బలోపేతం చేయడానికి మనందరం కలిసి రావాలని ప్రియాంక పిలుపునిచ్చారు.



552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles