రాఫెల్ ఒప్పంద స‌మ‌యంలో నేను అధికారంలో లేను..

Wed,September 26, 2018 07:51 AM

Was not in power when Rafale deal signed, says Frances Macron at UN

పారిస్: రాఫెల్ యుద్ధ విమానాల వివాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుల్ మాక్రన్ స్పందించారు. రాఫెల్ కొనుగోలు కోసం జరిగిన ఒప్పంద సమయంలో తాను అధికారంలో లేనని మాక్రెన్ తెలిపారు. ఓ భారతీయ టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 36 యుద్ధ విమానాల కోనుగోలో భారీ అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఒప్పందం జరిగిన సమయంలో తాను ఇన్‌చార్జ్‌ను కాదని, కానీ స్పష్టమైన రూల్స్ ప్రకారమే ఒప్పందం జరిగి ఉంటుందని, అది రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమని, రెండు దేశాల వ్యూహాత్మక రక్షణ ఒప్పందంలో భాగంగా ఆ డీల్ జరిగి ఉంటుందని మాక్రన్ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా గత ఏడాది మే నెలలో బాధ్యతలు స్వీకరించారు. 2016లో రాఫెల్ జెట్ ఒప్పందం జరిగింది. ఆ సమయంలో ఫ్రాంకోయిస్ హోలాండే అధ్యక్షుడిగా ఉన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌కు రాఫెల్ కోనుగోలును అప్పగించామని హోలాండేనే ఇటీవల స్పష్టం చేశారు.

1765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles