సరికొత్త కాఫీ.. ట్రై చేస్తారా.. వీడియో

Mon,June 10, 2019 12:24 PM

ఏంటి ఆఫీసులో పని చేసీ.. చేసీ అలసిపోయారా? తలనొప్పిగా ఉందా? మీలాంటి వాళ్ల కోసమే ఈ సరికొత్త కాఫీ. అవును.. ఇది మామూలు కాఫీ కాదు.. వెరైటీ కాఫీ. దాన్ని చూస్తేనే మీ తలనొప్పి మాయం అయిపోతుంది. తాగుతారా ఆ కాఫీని. ఇంకెందుకు ఆలస్యం.. ముందు వీడియో చూడండి.. తర్వాత తాగుదురు కానీ..


చూశారు కదా. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కంపెనీలో దీన్ని ఏర్పాటు చేశారట. కంపెనీలో ఉన్న స్టాఫ్ ఇదివరకు కాఫీలకు కాఫీలు లాగించేవారట. పని తక్కువ.. తాగుడు ఎక్కువగా ఉండేదట. హమ్మా.. ఇంత పనికి వస్తారా? మీ సంగతి చెబుతాను ఆగండి.. అని కంపెనీ యాజమాన్యం.. ఇదిగో కాఫీ మిషన్‌ను అలా ఏర్పాటు చేయించింది. దీంతో ఒక్క ఉద్యోగి కూడా ఆరోజు నుంచి అక్కడ కాఫీ తాగితే ఒట్టు. భలే ఉంది కదా ఐడియా.


3158
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles