భార‌త్‌కు రావాల‌నే ఉంది కానీ..: విజ‌య్ మాల్యా

Fri,September 9, 2016 02:43 PM

Want to return to India but passport has been revoked: Vijay Mallya to court

న్యూఢిల్లీ: ఇండియాకు తిరిగి రావాల‌నే త‌న‌కూ ఉంద‌ని, అయితే కేంద్రం త‌న‌ పాస్‌పోర్ట్‌ను ర‌ద్దు చేసింద‌ని లిక‌ర్ బార‌న్ విజ‌య్ మాల్యా శుక్ర‌వారం ప‌టియాలా హౌజ్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కోఆప‌రేట్ చేయ‌డానికి మాల్యా సిద్ధంగా ఉన్నా.. ఆయ‌న తిరిగి దేశానికి రావ‌డం అసాధ్య‌మైంద‌ని ఆయ‌న త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టుకు విన్నవించారు. బ్యాంకుల‌కు 9 వేల కోట్లు ఎగ్గొట్టి, గ‌త మార్చి నెల‌లో లండ‌న్ వెళ్లిపోయారు మాల్యా. దీనిపై మ‌నీలాండ‌రింగ్ కేసు న‌మోదు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట్‌రేట్ విచార‌ణ జ‌రుపుతోంది. కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న 950 కోట్ల అప్పులో స‌గం విదేశాల్లో ఆస్తులు కూడ‌బెట్టుకోవ‌డానికి ఉప‌యోగించార‌ని ఈడీ కేసు న‌మోదు చేసింది. యూకేలో ఉన్న మాల్యాను తిరిగి పంపించ‌డానికి ఆ దేశం అంగీక‌రించ‌క‌పోవ‌డం కేసు విచార‌ణ‌ను మ‌రింత సంక్లిష్టం చేసింది. యూకేలో ఎన్నాళ్ల‌యినా ఉండే హ‌క్కు 1992 నుంచి మాల్యాకు ఉంది. రాజ్య‌స‌భ ఎంపీగా దౌత్య పాస్‌పోర్ట్‌తో మాల్యా యూకే వెళ్ల‌గా.. దానిని ఏప్రిల్‌లో కేంద్రం ర‌ద్దు చేసింది. విచార‌ణ‌లో భాగంగా ఈడీ గ‌త శ‌నివారం మాల్యాకు చెందిన 6500 కోట్ల ఆస్తుల‌ను జ‌ప్తు చేసింది.

1363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles