టోల్ ప్లాజాల వ‌ద్ద వీఐపీల‌కు, జ‌డ్జిల‌కు ప్ర‌త్యేక‌ లేన్ కావాల‌ట‌..

Thu,August 30, 2018 10:20 AM

want separate lanes for VIPs, Judges at toll plazas

చెన్నై: వీఐపీల‌కు, జ‌డ్జిల కోసం దేశ‌వ్యాప్తంగా టోల్‌ప్లాజాల వ‌ద్ద ప్ర‌త్యేక లేన్‌ను ఏర్పాటు చేయాల‌ని జాతీయ ర‌హ‌దారుల సంస్థ‌కు మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టోల్ గేట్ల వ‌ద్ద వీఐపీ, సిట్టింగ్ జడ్జీల వాహ‌నాల‌ను ఆప‌డం బాధ క‌లిగిస్తోంద‌ని, ప్లాజాల వ‌ద్ద జ‌డ్జీల‌ను కూడా 15 నిమిషాల పాటు ఎదురుచూసేలా చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ర‌మేశ్‌, ముర‌ళీధ‌ర‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అన్ని టోల్ ప్లాజాల‌కు త‌క్ష‌ణ‌మే ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని ధ‌ర్మాస‌నం .. నేష‌న‌ల్ హైవే అథారిటీని ఆదేశించింది. స‌ర్క్య‌ల‌ర్ ఇవ్వ‌కుంటే అధికారుల‌కు షోకాజ్ నోటీసులు ఇస్తామ‌ని కోర్టు హెచ్చ‌రించింది.

1524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles