గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నాం: కుమారస్వామి

Sat,May 19, 2018 05:55 PM

Waiting for Governor invitation says Kumaraswamy

బెంగళూరు: అనేక నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. దీంతో కాబోయే ముఖ్యమంత్రి, జేడీఎస్ లీడర్ హెచ్‌డీ కుమారస్వామి గవర్నర్ వాజుభాయ్ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నారు. గవర్నర్ నుంచి ఆహ్వానం అందగానే ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నది నిర్ణయిస్తామని ఆయన మీడియాతో తెలిపారు. బలం లేకపోయినా బీజేపీ అధికారం కోసం ఎలా ప్రయత్నాలు చేసిందో ప్రజలంతా చూశారని కుమారస్వామి ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.

1228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS