అమల్లోకి రానున్న వేతనాల కోడ్ -2019 బిల్లు

Fri,August 23, 2019 10:31 PM

Wages Code -2019 Bill to come into force

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు కనీస వేతనం అందనున్నది. ఇందుకు వీలు కల్పించే వేతనాల కోడ్-2019 బిల్లును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వేతనాలు, బోనస్‌లకు సంబంధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. వేతనాల కోడ్-2019 బిల్లు జూలై 30న లోక్‌సభలో, ఆగస్టు 2న రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈనెల 8న దీన్ని రాష్ర్టపతి ఆమోదించారు. దేశవ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు కనీస వేతనాన్ని అందించడంతో పాటు.. వేతనాల చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యల పరిష్కారానికి ఈ బిల్లు మార్గం చూపిస్తుందని భావిస్తున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే, పురుషులు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్‌కి చెల్లిస్తున్న వేతనాల్లో కూడా వ్యత్యాసం పోనున్నది. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత.. ప్రస్తుతం వేతనాలు, బోనస్ తదితర చెల్లింపుల కోసం అమలు చేస్తున్న కనీస వేతనాల చట్టం, వేతనాల చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన వేతన చట్టాలు రద్దవుతాయి.

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles