సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ ప్రారంభం

Sun,May 12, 2019 07:08 AM

Voting begins for 59 parliamentary constituencies in the 6th phase of polling

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ర్టాల్లో 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ జరుగుతుంది. మధ్యప్రదేశ్-8, ఢిల్లీ-7, హరియాణా-10, జార్ఖండ్-4, పశ్చిమబెంగాల్-8, బిహార్-8, ఉత్తరప్రదేశ్-14 స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్‌ను చేపట్టారు. ఆరో దశ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 979 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 1,13,167 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు. 10,17,82,472 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 5,42,60,965 మంది పురుష ఓటర్లు.. 4,75,18,226 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 3,281 మంది ఉన్నారు. ఈ దఫా ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, హర్షవర్ధన్, మేనకాగాంధీ, నరేంద్రసింగ్ తోమర్, రావు ఇంద్రజిత్‌సింగ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, భూపీందర్‌సింగ్ హుడా, జ్యోతిరాదిత్య సింధియా, షీలాదీక్షిత్, బాక్సింగ్ క్రీడాకారుడు విజేందర్‌సింగ్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తదితరులు ఉన్నారు.

607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles