క‌ర్నాట‌క‌లో ఉప ఎన్నిక‌లు.. పోలింగ్ ప్రారంభం

Thu,December 5, 2019 07:50 AM

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క‌లో ఇవాళ 15 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఉద‌యం 7 గంట‌ల‌కే పోలింగ్ ప్రారంభ‌మైంది. ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. బీఎస్ య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వానికి ఈ ఉప ఎన్నిక‌లు కీల‌కంగా మారాయి. 224 స్థానాలు ఉన్న క‌ర్నాట‌క అసెంబ్లీలో.. య‌డ్డీ పార్టీకి కేవ‌లం 106 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. మెజారిటీ కోసం ఆ పార్టీకి క‌నీసం మ‌రో 6 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉన్న‌ది. హెచ్‌డీ కుమార‌స్వామి కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్‌, జేడీఈఎస్ ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ అన‌ర్హ‌త వేటు వేశారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల స్థానాల‌కే ఉప ఎన్నిక నిర్వ‌హిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ప్ర‌జ‌లంతా భారీగా ఓటింగ్‌కు త‌ర‌లి రావాల‌ని సీఎం య‌డ్డీ పిలుపునిచ్చారు. క‌ర్నాట‌క‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న నియోజ‌క‌వ‌ర్గాలు ఇవే. అథ‌ని, చిక్‌బ‌ల్లాపూర్‌, గోక‌క్‌, హిరేకేరూర్‌, హోసాకోటే, హున‌సూరు, కాగ్‌వాడ్‌, కేఆర్ పురా, కృష్ణ‌రాహ‌ప‌తే, మ‌హాల‌క్ష్మీ లేఔట్‌, రానిబెన్నూరు, శివాజీన‌గ‌ర్‌, విజ‌య‌న‌గ‌ర‌, యెల్లాపూర్‌, య‌శ్వంత‌పూర్ ఉన్నాయి.

410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles