ఆత్మ‌ప్ర‌బోధానుసారం ఓటు వేయండి : మీరా కుమార్‌Mon,July 17, 2017 02:49 PM

ఆత్మ‌ప్ర‌బోధానుసారం ఓటు వేయండి :  మీరా కుమార్‌

న్యూఢిల్లీ: ఆత్మ‌ప్ర‌బోధానుసారం ఓటు వేయాల‌ని ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను కోరారు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి మీరా కుమార్. దేశాన్ని ఐక్యంగా ఉంచే ఐడియాల‌జీ కోసం ఓటు వేయాల‌ని ఆమె కోరారు. ఈ రోజు చాలా విలువైనద‌ని, కూట‌మి పార్టీలు కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నాయ‌ని, రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా తాను ఓ ఐడియాల‌జీ కోసం పోరాటం చేస్తున్న‌ట్లు మీరా కుమార్ తెలిపారు. సామాజిక న్యాయం, స‌మ‌గ్ర అభివృద్ధి, పార‌ద‌ర్శ‌క‌త‌, భావ‌స్వేచ్ఛ‌, పేద‌రిక నిర్మూల‌న‌, కుల‌నిర్మూల‌న లాంటి అంశాల‌నే ఐడియాల‌జీగా ఎంచుకున్న‌ట్లు మాజీ లోక్‌స‌భ స్పీక‌ర్ తెలిపారు. మ‌న ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త మ‌నేద‌న‌న్నారు.

613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS